మెగా ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌..”ఆచార్య” నుంచి మాస్‌ సాంగ్‌ వచ్చేసింది !

-

మెగాస్టార్‌ చిరంజీవి చేస్తున్న తాజాగా సినిమా ఆచార్య. ఈ ఆచార్య సినిమాకు టాలీవుడ్‌ సక్సెస్‌ ఫుల్‌ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవికి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా… .. మరో జంటగా రామ్ చరణ్ అలాగే పూజా హెగ్డే నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే… పూర్తి కాగా విడుదలకు కూడా రెడీ అయింది. అలాగే ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్… మరియు పోస్టర్లు ఈ సినిమా పై అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.

న్యూ ఇయర్‌ కానుకగా.. ఈ సినిమా నుంచి ఓ మాస్‌ సాంగ్‌ ను రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటన చేసింది. షానా కష్టం అంటూ సాగే ఈ మాస్‌ సాంగ్‌ ను జనవరి 3 వ తేదీ… సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా వదిలింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌ లో చిరంజీవి అదిరిపోయే లుక్‌ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news