సూర్యాపేట జాతీయ కబడ్డీ పోటీల్లో అపశ్రుతి: వంద మందికి గాయాలు ?

సూర్యాపేట జిల్లా కేంద్రంలో 47వ జాతీయ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మైదానంలో ఏర్పాటు చేసిన ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలిపోయింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. దీంతో సుమారు 100 మందికి పైగా ప్రేక్షకులకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. క్షతగాత్రులను తక్షణమే పోలీసులు, 108 సిబ్బంది సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.

కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ 1500 మంది దాకా ప్రేక్షకులు ఉన్నారని అంటున్నారు. జాతీయ గీతం ఆలపించడానికి లేచినప్పుడు ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. సామర్థ్యానికి మించి జనాన్ని అనుమతిన్చ్జడంటో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.  ఆస్పత్రుల్లో క్షతగాత్రులను మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.