మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై… జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ హీరో సాయి ధరంతేజ్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. ఆయన స్పృహలోనే ఉన్నారని ప్రస్తుతం వెంటిలేటర్ తొలగించినట్లు వైద్య బృందం స్పష్టం చేసింది. ఈ మేరకు హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. మూడు రోజుల కిందటే ఆయనను ఐసియు నుంచి ప్రత్యేక గదికి మార్చామని పేర్కొన్నారు వైద్యులు.

“ప్రస్తుతం సొంతంగానే సాయి ధరమ్ తేజ్ శ్వాస తీసుకుంటున్నాడు. అందరితో మాట్లాడగలుగుతున్నారు. మరో మూడు రోజుల్లో సాయిధరమ్ తేజ్ ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తాం” అని బులెటిన్లో పేర్కొన్నారు వైద్యులు. కాగా  సాయి ధరమ్ తేజ్ వినాయక చవితి పర్వ దినాన రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 45 నుండి గచ్చిబౌలి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అతివేగం తో వెళ్ళడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.