రాజ్‌పుత్‌ రాణి గెటప్‌లో సాయిపల్లవి..!

-

హీరోయిన్ సాయిపల్లవి తాజాగా మరో త్రోబ్యాక్‌ వెకేషన్‌ స్టిల్‌ను అందరితో పంచుకుంది. ఈ బ్యూటీ తనకు టైం దొరికినపుడు జైపూర్‌ వెకేషన్‌కు వెళ్లింది. ఆ కోటల్లో ఎంతో ఆహ్లాదంగా ఎంజాయ్‌ చేసింది సాయిపల్లవి. అంతేకాదు రాజ్‌పుత్‌ వంశానికి చెందిన రాణులు వేసుకున్న దుస్తులను ప్రతిబింబించే కాస్ట్యూమ్స్‌ ధరించింది. రాజ్‌పుత్‌ రాణి గెటప్‌లో కోటపై నుంచి తొంగి చూస్తున్న స్టిల్‌ సాయిపల్లవి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది.. క్షణాల్లో ఆ ఫోటో వైరల్ గా మారింది.

View this post on Instagram

♥️

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on

అచ్చం రాణిలానే ఉన్నారంటూ కామెంట్స్ చేస్తూ సాయిపల్లవి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అయితే తన తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం విరాటపర్వం, లవ్‌ స్టోరీ చిత్రాలతో బిజీగా ఉంది. ఇకపోతే లాక్ డౌన్ సమయంలో తన తల్లితో కలిసి కారులో షికారు చేస్తూ.. తొలకరిని ఎంజాయ్ చేస్తున్న ఫోటో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news