ఆ సమయంలో మానసికంగా దెబ్బ తిన్నాను అంటున్న సాయి పల్లవి..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నాచురల్ బ్యూటీగా ఫిదా సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో.. మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఇక మరెన్నో సినిమాలలో అవకాశాలను సొంతం చేసుకోవడమే కాకుండా తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా మలయాళం , తమిళ్ భాష చిత్రాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్న సాయి పల్లవికి ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆమె నటనకు లేడీ పవర్ స్టార్ అనే బిరుదును కూడా ఆమెకు అంకితం చేయడం గమనార్హం.

ఇకపోతే బుల్లితెరపై ప్రసారమైన ఢీ జూనియర్ డాన్స్ ప్రోగ్రాం నుంచి తన కెరియర్ను మొదలుపెట్టిన ఈమె అక్కడ టైటిల్ విన్నర్ గా నిలవడంతో ఆ తర్వాత ఈమెకు సినిమాలలో అవకాశాలు రావడం జరిగాయి. ఇక బుల్లితెర నుంచి తన ప్రాయాణాన్ని మొదలుపెట్టిన సాయి పల్లవి నేడు దేశం గర్వించదగ్గ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా చాలామంది ఆమెకు ఆమె ముఖం మీద ఉన్న మొటిమలే అందాన్ని తీసుకొచ్చి పెడతాయని అందరూ అంటూ ఉంటారు. కానీ ఇదే విషయంలో ఈమె సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో మానసికంగా కృంగిపోయాను అని వెల్లడించింది.

ఇక అసలు విషయం ఏమిటంటే సాయి పల్లవి ప్రేమమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక తర్వాత ఫిదా సినిమాలో ఎంట్రీ ఇచ్చినప్పుడు తన ముఖం మీద మొటిమలు ఎక్కువగా ఉండేవి కదా హీరోయిన్ అంటే చాలా అందంగా.. చూడడానికి ఇంపూసంపు కరెక్ట్ గా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు . ఇలా ముఖం నిండా మొటిమలతో ఉన్న నన్ను ఎవరు ఆదరిస్తారు.. నా సినిమా సక్సెస్ అవుతుందో లేదో అంటూ ఆమె చాలా మానసికంగా కృంగిపోయిందట . ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత నటన ఉంటే చాలు అందంతో పనిలేదు అని ప్రేక్షకులు నిరూపించారు అంటూ తన మనసులోని భావాలను వెల్లడించింది సాయి పల్లవి. ఇక ప్రస్తుతం లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news