ఈ వీడియో వల్లే.. తను మారిపోయానంటున్న సాయి పల్లవి..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ సాయి పల్లవి. తన న్యాచురల్ అందంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంది. తాజాగా విరాటపర్వం సినిమాలో నటించిన సాయి పల్లవి ఈ సినిమా ప్రమోషన్ లో శరవేగంగా పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎక్స్పోజింగ్ చేయని హీరోయిన్ అంటే సాయి పల్లవి పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఇక తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో పొట్టి బట్టలు వేసుకో పోవడంతో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని కానీ అలాంటివి అవుట్ ఫిట్ లో కంఫర్ట్ ఉండదని తెలియజేసింది..మన సాయిపల్లవే... బహుశా మీరు ఈ డాన్స్ చూసి ఉండరు... అదిరిపోయింది... - Muchata.com Latest Telugu Newsతను అలాంటి బట్టలు ధరించక పోవడానికి ఒక వీడియో కారణం అని ఒక విషయాన్ని బయట పెట్టింది. తను డాక్టర్ కోర్సు చదువుతున్న సమయంలో జార్జియా కి వెళ్లగా.. అక్కడ టాంగ్ డాన్స్ నేర్చుకుందట ఈ వీడియోలో ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి దానికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ వేసుకోవలసి వచ్చిందట. ఇక తన తల్లితండ్రులకు అలాంటి దుస్తులు వేసుకొని డాన్స్ చేయడం ఇష్టం లేదని అయినా కూడా వాళ్ళను ఒప్పించి తన పెర్ఫార్మెన్స్ చేశానని తెలియజేసింది

ఆ సమయంలో తనకి ప్రేమమ్ సినిమాలో ఆఫర్ వచ్చిందని ఆ సినిమాతో మంచి గుర్తింపు రావడమే కాకుండా డాన్స్ పర్ఫార్మెన్స్ వీడియో బయటకి రావడం జరిగిందట. ఆ వీడియో ఎలా వచ్చిందో తనకు తెలియదని కాని.. దాని వల్ల పలు విమర్శలు కూడా వచ్చాయి అని తెలియ జేసింది ఆ సమయంలో తను చాలా బాధపడ్డారని ఇక అప్పటి నుంచి అలాంటి దుస్తులను వేసుకోకూడదు నిర్ణయించుకున్నానని తెలియజేసింది సాయి పల్లవి. ప్రస్తుతం ఈమె చెప్పినా ఈ విషయాలు మాత్రం చాలా వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news