సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల

టాలీవుడ్ హీరో, మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల అయింది. కాసేపటి క్రితమే సాయిధరమ్తేజ్ హెల్త్ బులిటెన్ అపోలో ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. “హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. క్రమంగా మెరుగుపడుతుంది, కాలర్ బోన్ సర్జరీ తర్వాత అబ్జర్వేషన్ లో ఉంచాము. ఐసీయూలో వెంటిలేటర్ పై సాయి ధరం తేజ్ కు వైద్యం అందిస్తున్నాం. ప్రస్తుతం సాయి ధరంతేజ్ కు శ్వాస తీసుకోవడం సులభతరంగా మారింది. ఇప్పుడిప్పుడే సాయిధరమ్తేజ్ కోలుకుంటున్నారు.” అంటూ తమ హెల్త్ బులిటెన్ లో అపోలో వైద్యులు పేర్కొన్నారు.

ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు వైద్యులు. కాగా  సాయి ధరమ్ తేజ్ వినాయక చవితి పర్వ దినాన రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 45 నుండి గచ్చిబౌలి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అతివేగం తో వెళ్ళడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.