టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడపై ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇవాళ తాడెపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2019 వరకు చంద్రబాబు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని సజ్జల పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు హడావిడి చేస్తున్నారు. రాజకీయాలు ప్రజల కోసం ఉండాలన్నారు. పొత్తులేకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ చేయలేదు. తిట్టిన నోటితోనే బీజేపీని పొగుడుతున్నారు. నడ్డాతో చంద్రబాబు వంగి.. నంగి నంగి మాట్లాడారు.
చంద్రబాబు బఫూన్ కి ఎక్కువ.. జోకర్ కి తక్కువ అన్నారు సజ్జల. అసలు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలో చంద్రబాబుకి క్లారిటీ లేదన్నారు సజ్జల. బీజేపీతో పొత్తుకోసం చంద్రబాబు తహతహలాడుతున్నారు. రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చారు చంద్రబాబు. ప్రజలను భ్రమలో పెట్టానుకునే వారు భ్రమలోనే ఉంటారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిని అవమానించారని పేర్కొన్నారు. ఏపీ పరువు తీస్తున్నారు చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు సజ్జల. లోకేష్ పాదయాత్రకు టీడీపీ కార్యకర్తలే రావడం లేదన్నారు.