అల్లు అర్జున్ చాలా మంచోడు.. : పోసాని

-

తెలుగు సినిమా పరిశ్రమ గర్వించే విధంగా అల్లు అర్జున్ జాతీయ అవార్డును సొంతం చేసుకుని ప్రపంచంలో గుర్తింపును అందుకున్నాడు. ఈ విషయంపై రాజకీయంగా మరియు సినీ పరంగా చాలా మంది అల్లు అర్జున్ ను ప్రశంసించారు. తాజాగా డైరెక్టర్ మరియు నటుడు పోసాని కృష్ణ మురళి అల్లు అర్జున్ కు వచ్చిన అవార్డు గురించి స్పందించాడు. ఈయన మాట్లాడుతూ బన్నీ చాలా మంది వాడు.. మంచి వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. తెలుగు సినిమా పరిశ్రమ తలెత్తుకునేలా బన్నీ ఎంతోమంది మహనీయులు సాధించలేనిది చేసి చూపించాడు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ అల్లు అర్జున్ నాకు ఒకసారి 5 లక్షలు ఇచ్చాడు అని గుర్తు చేశాడు. డబ్బులు ఇస్తూ మీరు మంచి పనులకు మాత్రమే ఉపయోగిస్తారని చెప్పినట్లు పోసాని గుర్తు చేసుకున్నాడు.

ఆ డబ్బును నేను ఆర్ధిక స్థోమత లేని ముగ్గురు విద్యార్థులకు బట్టలు మరియు చదువు ఖర్చుల కోసం ఇచ్చానని చెప్పాడు పోసాని మురళి.

Read more RELATED
Recommended to you

Latest news