తెలంగాణ లో టీచర్ల బదిలీలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. టీచర్ల బదిలీపై మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరిస్తూ బుధవారం ఆదేశాలను జారీ చేసింది హైకోర్టు. ఉపాద్యాయ సంఘాల నేతలకు 10 అదనపు పాయింట్లు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. టీచర్ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్ల కేటాయించడానికి అనుమతించింది హైకోర్టు. భార్యభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమన్నది హైకోర్టు. టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. పిటీనర్ల తరపున చిక్కుడు ప్రభాకర్, కృష్ణయ్య తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ఏజీ రామచంద్రారావు తమ వాదన వినిపించారు.