జనవరిలో 1వ తేదీకే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని సజ్జల ప్రకటన చేశారు. గతంలో రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు టైంకు వేసే వారని.. మిగిలిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేసే వారని గుర్తు చేశారు. తమ వైసీపీ ప్రభుత్వం అందరికీ ఒకేసారి జీతాల చెల్లింపులు చేయాలన్న ప్రయత్నం చేస్తుండటం వల్ల ఆలస్యం అవుతోందని తెలిపారు.
మొత్తం జీతాలు, పెన్షన్ల చెల్లింపుల్లో 70 శాతం వరకు 1, 2 తేదీల్లోనే జమ అవుతున్నాయని.. మిగిలిన 30 శాతం చెల్లింపులే కొంచెం ఆలస్యం అవుతున్నాయన్నారు. ఈ నెలలో ఇంకాస్త ఆలస్యం అయ్యిందని వెల్లడించారు సజ్జల. ఇక ముందు ఆలస్యం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. సంక్రాంతి నాటికి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని.. వారిని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు సజ్జల.