అమలాపురం ఉద్రిక్తతలు.. విపక్షాల కుట్రే : సజ్జల

-

కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. అంతేకాకుండా పోలీసులపై రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అయితే.. ఈ ఉద్రిక్తతల వెనుక విపక్షాల హస్తం ఉందని ఇప్పటికే హోంమంత్రి తానేటి వనితి ఆరోపణలు గుప్పించారు. అయితే తాజాతా అమలాపురం పరిస్థితులపై స్పందించిన ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి.. రాజకీయ లబ్ది కోసమే విపక్షాలు కుట్రకు తెరదీశాయని మండిపడ్డారు.

జిల్లాకు అంబేద్కర్ పేరుపెడితే మా పార్టీకి ఏమైనా లాభం ఉంటుందా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి అని ఉద్ఘాటించారు. కోనసీమ జిల్లా పేరు మార్పుకు ప్రధాన రాజకీయ పక్షాలన్నీ మద్దతు పలికాయని స్పష్టం చేశారు. ఇదేమీ హడావుడిగా తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. అయితే, ఏ శక్తులు కుట్ర పన్నాయో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు సజ్జల.

Read more RELATED
Recommended to you

Exit mobile version