ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రథమ శత్రువుగా చంద్రబాబు, టీడీపీ ఉందని సజ్జల ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో ఎస్సీ, మైనార్టీలు పైనా సభలు పెడతామని ప్రకటించారు. రీజినల్ పార్టీలో నాయకుడికి సన్నిహితంగా ఉన్నవారు సభలో ఉండటం సహజమేనని పేర్కొన్నారు. అటు రాష్ట్ర విభజన తీరును సవాల్ చేస్తూ సుప్రీం లో కేసుపై ఉండవల్లి చేసిన విమర్శలపై స్పందించారు సజ్జల.
ఈ నేపథ్యంలోనే, తెలుగు రాష్ట్రాల విభజనపై సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. కుదిరితే మళ్లీ ఉమ్మడిగా ఏపీ ఉండాలన్నదే వైసీపీ విధానం.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలినుంచి వైసీపీ పోరాటం.. మళ్లీ ఏపీని ఉమ్మడి రాష్ట్రం చేస్తే ముందుగా స్వాగతించేది వైసీపీనే.. విభజనకు వ్యతిరేకంగా కోర్టులో మా వాదన బలంగా వినిపిస్తాం.. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి లేదంటే సరిదిద్దాలని కోరతామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలసి ఉండాలన్నదే ఇప్పటికీ మా విధానమని.. రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేశారు. విభజన చట్టంలో హామీల అమలు కోసం కాదని వెల్లడించారు. విభజనచట్టంలో హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉందని.. రెండు రాష్ట్రాలు కలసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముందని సజ్జల పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కలిసే దానికోసం వైకాపా పోరాటం చేస్తుందన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి.