పుచ్చకాయ సాగులో చీడపీడల నివారణ చర్యలు..

-

పుచ్చకాయలో ఎన్నో పోషకాలు ఉన్న సంగతి తెలిసిందే..అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ పంటను అధిక సంఖ్యలో పండిస్తున్నారు.వేసవికి అనువైన పంట. అన్ని కాలాలకు అనువైన రకాలు రావడంతో రైతులు అన్ని కాలాలో సాగుచేస్తున్నారు. నీరు ఇంకే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, సారవంతమైన ఇసుక నేలలు, ఉదజని సూచిక 6-7 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి..ఈ వాతావరణం కన్నా పొడిగా ఉన్నప్పుడు అధిక దిగుబడిని పొందవచ్చు..

అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్న రైతులు పూర్తి విస్తీర్ణన్ని ఒకేసారి కాకుండా దఫా, దఫాలుగా కొన్ని రోజుల వ్యత్యాసంతో విత్తుకోవాలి. విత్తనం వేసే ముందు భూమిని 2-3 సార్లు దమ్ము చేసుకొని నేలమొత్తం వదులుగా అయ్యేల దున్నుకోవాలి. చివరి దుక్కికి ముందు ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 25-30 కిలోల యూరియ, మ్యూరేట్ ఆఫ్ పోటాష్ వేసుకొని చివరి దమ్ము చేసుకొని భూమిని విత్తనానికి సిద్ధం చేసుకోవాలి..అప్పుడు అధిక దిగుబడిని పొందవచ్చు.ధరలను మనం అంచనా వెయ్యలెము.. అప్పటికి మార్కెట్ లో ఎంత వుంటే అంత అంచనా వెయ్యొచ్చు..

పుచ్చకాయలో తెగుల్లు, చీడపీడల నివారణ..

తెల్ల దోమ పంటకు తీవ్ర నష్టాన్ని చేస్తుంది.జిగురు కలిగిన పసుపు రంగు అట్టలను చేనులో ఏర్పాటు చేసుకోవలెను. వీటి ఉధృతి ఎక్కువగా ఉంటె నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 3 ఎంఎల్ ఇమిడాక్లోప్రిడ్ లేదా 2 గ్రాముల ఎసిటామిప్రిడ్ కలుపుకొని పిచికారి చేసుకోవలెను. తామర పురుగు తామర పురుగు ఆకులు ముడతలుగా, పసుపు రంగుకు మారి మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 2 ఎంఎల్ ఫిప్రోనిల్ కలిపి పిచికారి చేయాల్సి వుంది..

అదే విధంగా పొడి వాతావరణ పరిస్థితులలో ఈ ఎర్రనల్లి పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. దీనిని గుర్తుంచడం చాల కష్టం. ఈ పురుగు ఆకు యొక్క అడుగు బాగామునకు చేరి రసాన్ని పిలుస్తూ పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణ చర్యకు 1 లీటర్ నీటికి 1.5 ఎంఎల్ స్పెరోమేసిఫిన్ లేదా 3 ఎంఎల్ ప్రోపర్ గైడ్ కలుపుకొని పిచికారి చేయాలి.
కాయ తొలచు పురుగు..పంట చేనులో పూతదశలో క్యూలూర్ ఎరలను ఏర్పాటు చేసుకోవాలి. క్యూలూర్ అందుబాటులో లేని సమయములో 10 లీటర్ల నీటిలో 100 ఎంఎల్ మలాథియాన్ మరియు 100 గ్రాముల బెల్లం కలుపుకొని వెడల్పాటి పళ్ళెంలో ఈ ద్రవాన్ని పోసి పంట చేనులో అక్కడ, అక్కడ ఎరలుగా ఉంచాలి. దీనివల్ల ఈ పండు ఈగ కాయలను ఆశించక ముందే నివారించవచ్చు. పంటకు ఆశించిన వెంటనే నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 2 ఎంఎల్ మలాథియాన్ లేదా 2 ఎంఎల్ క్లోరిపైరిఫాస్ కలుపుకొని పిచికారి చేయడం వల్ల నివారించవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version