జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న సలార్..!!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన లైనప్ చూసి బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా కుళ్ళు కుంటున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రోజెక్ట్ కె, స్పిరిట్ ఇలా ఉంది మనోడి సినిమాల జాబితా ఇవన్ని 2000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాలు ఉన్నాయంటే ప్రభాస్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ దేశంలో అత్యదిక వసూళ్ళు సాధించిన చిత్రంగా గా బహుబలి రికార్డ్ పదిలంగా ఉంది.

ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ నెలలో రిలీజ్ కు సిద్దంగా ఉంది.ఈ సినిమా తర్వాత  ప్రస్తుతం తన దృష్టి అంతా రెండు ప్రాజెక్ట్ లపై పెట్టాడు. ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సలార్’లో , మరియు ప్రోజెక్ట్ కె సినిమాలలో  నటిస్తున్న విషయం తెలిసిందే. సలార్ మూవీ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ రంగంలోకి  దించారు.ఈ విలన్‌ పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్  కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నారు షూటింగ్ లో పాల్గొన్న ఆయన ఈ సినిమా సెట్స్ గురించి మాట్లాడుతూ నభూతో నభవిష్యతి అన్న విదంగా ఉన్నాయని చెప్పారు.

ప్రస్తుతం, సలార్ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ మార్చిలోనే సలార్ షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన ప్రోజెక్ట్ K,  రాజ డీలక్స్ సినిమాల షూటింగ్స్ ఉండటం చేత.. వచ్చే నెలాఖరులో సలార్ షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు. సలార్ సినిమాకు గానూ దాదాపు 20 రోజుల షూటింగ్  మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. ఇక సెప్టెంబర్ నెలలో రిలీజ్ పక్కా అని ఎటువంటి వాయిదా లేదని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news