సలార్ ట్రైలర్ సునామి.. 75 మిలియన్స్ కి పైగా వ్యూస్..!

-

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో మాట్లాడుకుంటున్న మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చిత్రమే “సలార్”. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో మొట్టమొదటి సారిగా వస్తున్నా ఈ సెన్సేషనల్ యాక్షన్ ప్రాజెక్ట్ పై ఉన్న హైప్ కోసం ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అవైటెడ్ ట్రైలర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేయగా దీనికి ఇప్పుడు అన్ని భాషల్లో కూడా ఒక మాసివ్ రెస్పాన్స్ అయితే నమోదు అవుతుంది.

మరి ఈ ట్రైలర్ వచ్చి ఇంకా 24 గంటలు కూడా పూర్తి కాకుండానే ఎన్నో రికార్డ్స్ ని సెట్ చేస్తోంది. మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ అయితే ఈ ఐదు భాషల్లో ఇప్పుడు ఏకంగా 75 మిలియన్ కి పైగా వ్యూస్ ని క్రాస్ చేసేసి సత్తా చాటుతుంది. దీంతో పాటు ఈ సినిమా పట్ల ఆడియెన్స్ ఏ లెవెల్లో ఆసక్తిగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ మొత్తం 24 గంటల్లో అయితే ఈ మార్క్ 100 మిలియన్ దాటినా కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పాలి. మరి ఆ స్టాట్స్ ఎంత వస్తాయో అనేది చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news