చిత్ర పరిశ్రమలో మరో విషాదం..కండల వీరుడి డూప్ మృతి

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు.

ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ డూప్ సాగర్ పాండే గుండెపోటుతో మరణించారు. ముంబైలో జిమ్ చేస్తుండగా ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. సాగర్ పాండే ఆత్మకు శాంతి కలగాలని కోరారు. సాగర్ సల్మాన్ తో బజరంగీ భాయిజాన్, ట్యూబ్ లైట్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, దబాంగ్, దబాంగ్ 2 చిత్రాల్లో నటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news