గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వయోపరిమితి పెంపు

-

ఏపీ నిరుద్యోగులకు జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వయోపరిమితి పెంపు వెసులుబాటును పొడిగిస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌. 2021 సెప్టెంబర్ 27 న జారీ చేసిన జీవో 105 ఉత్తర్వులను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పొడిగించింది ప్రభుత్వం. 2023 సెప్టెంబర్ వరకూ ఈ మినహాయింపు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం…. ఏపిపీఎస్సీ సహా మిగతా ప్రభుత్వ నియామక సంస్థలు ఈ అంశాన్ని నోటిఫై చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇక అటు.. తాజాగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఏకంగా 92 గ్రూప్1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది ఎపీపీఎస్సీ. అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొంది. రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే.. ఎఎంవీఐ ఉద్యోగాలకు నవంబర్ 2 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచనలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news