భారతదేశంలో ఉన్నవారందరూ హిందూ సంస్కృతికి హిందూ పూర్వీకులకు, హిందూ భూమికి చెందిన వారే అన్నారు. ఈ విషయాన్ని కొందరూ అర్థం చేసుకున్నప్పటికీ అమలు చేయడం లేదని.. దీనికి కారణం వారి అలవాట్లు, స్వార్థపర్వతమేనని చెప్పారు మోహన్ భగవత్. మనదేశం హిందూ దేశం అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను సమాజ్ వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య తీవ్రంగా ఖండించారు. భారతదేశం ఇప్పుడు, గతంలో హిందూ దేశం కాదని చెప్పారు. ఇండియా సహజంగానే బహుళతత్వం గల దేశమని చెప్పారు.
ఇందుకు స్వామి ప్రసాద్ మౌర్య శనివారం ట్వీట్ లో స్పందిస్తూ.. భారత దేశం ఇప్పుడు, గతంలో హిందూ దేశం కాదని చెప్పారు. ఇండియా సహజంగానే బహుళత్వంగల దేశమని చెప్పారు. లౌకిక రాజ్య భావన ఆధారంగా మన రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ఇండియాలో ఉన్నవారంతా ఇండియన్స్ అన్నారు. ఇండియన్ రాజ్యాంగం అన్ని మతాలు, విశ్వాసాలు, వర్గాలు, సంస్కృతులకు ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు.