సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారులు ఉగ్రవాదులకు హారతి ఇస్తున్నారు : యోగి

-

సనాతన ధర్మాన్ని దూషించడం, శ్రీరాముడు, శ్రీకృష్ణుడి ఉనికిని ప్రశ్నించడం ప్రతిపక్ష నేతలకు ఫ్యాషన్‌గా మారిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు.

సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారులు రామభక్తులపై కాల్పులు జరిపారని, ఉగ్రవాదులకు హారతి ఇస్తున్నారనితీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.నేరస్తులపై కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ, ప్రతిపక్ష పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు శ్రీరామ భక్తుల మరనాన్ని జరుపుకుంటాయి, గ్యాంగ్‌స్టర్ మరణానికి మొసలి కన్నీరు కారుస్తాయని యోగి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు .సగానికి పైగా లోక్ సభ స్థానాల్లో ఎన్నికలు ముగిశాయని, దేశం మొత్తం”ఆబ్కీ బార్ 400 పార్” నినాదం ప్రతిధ్వనిస్తోందని అన్నారు.రాముడు, కృష్ణుడిని అవమానించే వారికి సరైన స్థానాన్ని చూపించేందుకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.రాముడు మరియు కృష్ణుడి గురించి ప్రశ్నలు లేవనెత్తే వారిని మనం ఎలా అంగీకరించగలం? అంతిమంగా, దేశ ప్రజలే వారి ఓట్ల ద్వారా సమాధానం ఇస్తారు” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news