Dasara : ముచ్చటగా మూడోసారి రొమాన్స్ నాని.. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రంటే?

-

Dasara: నేచురల్ స్టార్ నాని.. హిట్స్.. ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు లైనప్ చేస్తున్నాడు. ఇటీవల ‘టక్ జగదీష్’ తో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే.. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడ‌లేదు. ఆశించిన స్థాయిలో క‌లెక్ష‌న్లు రాలేదు. ప్రస్తుతం ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే.. సుందరానికి’ సినిమాలు చేస్తున్నాడు నాని.. ‘శ్యామ్ సింగ రాయ్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల మ‌రో సినిమాను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

దసరా పండుగ రోజున ‘ఈ దసరా నిరుడు లెక్క ఉండదు’ అంటూ ‘దసరా’ అనే మరో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారట. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్‌ ఓదేల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా తెలంగాణ నేపధ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది

చిత్రబృందం. నాని డైలాగులకు, ఫ‌స్ట్ పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. కీర్తి ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సర్కారు వారి పాటలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తమిళ్‌లో అన్నాత్తేలోను నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రెండో హీరోయిన్‌కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం సమంతను సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తుంది. ఆమె కూడా ఓకే చెప్పిందట‌. నానితో స‌మంత ఇంతకుముందు ‘ఎటోవెళ్లిపోయింది మనసు’, ‘ఈగ’ సినిమాలు చేశారు. ఇది మూడో సినిమా కావ‌డం విశేషం..

Read more RELATED
Recommended to you

Latest news