విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు.. ఏపీ లోని అని పార్టీల నేతలు కార్మికుల కోసం నిలబడాల్సిందేనని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాసేపటి క్రితమే విశాఖలో జనసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభ కు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు పవన్ కళ్యాణ్.
అనంతరం ఆయన మాట్లాడుతూ… ఉక్కు కర్మాగారం లేకుంటే దేశం ముందుకు వెళ్ళదని… విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు అని చదువుకున్నామని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. కులాల కుంపట్లు, వర్గాల పోరులో నిండిపోయిన ప్రభుత్వంలో ఉక్కు ఉద్యమం ఊపు తెచ్చిందని గుర్తు చేశారు.
విశాఖ ఉద్యమం ఎలా జరిగిందో ఈ తరానికి చెప్పాలని.. ఎన్నో ఉద్యమాలు జరిగాయన్నారు పవన్ కళ్యాణ్. స్టీల్ ప్లాంట్ రావడానికి ఎంతో మంది త్యాగాలు చేశారని…స్టీల్ ప్లాంట్ కోసం ఏకంగా 37 మంది కార్మికులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్కు సంకల్పంతో ఈ సంస్థను కాపాడుకోవాలని… సమస్యలు వచ్చినప్పుడు ఎవరూ నిలబడరన్నారు. సైనికులు నిలబడతారని.. వీర మహిళలు నిలబడతారని పేర్కొన్నారు. మనం మన ఉక్కు పరిశ్రమను కాపాడుకుందామని.. అన్ని సంస్థకు స్వంత గనులు వున్నాయన్నారు పవన్ కళ్యాణ్.