సమంత కొత్త సిరీస్ టైటిల్ ఫిక్స్..!

-

టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చాలా సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ల ని కూడా సొంతం చేసుకుంది సమంత. తన అందంతో డాన్స్ తో అందరినీ మెప్పిస్తూ ఉంటుంది ఏ మాయ చేసావే సినిమాతో సమంత తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి హీరోయిన్ గా ఈమె పేరు తెచ్చుకుంది.మొన్నటిదాకా మాయోసైటిస్తో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుండి కోలుకుంటోంది. మళ్ళీ సినిమాల బాట పడుతున్నట్లు తెలుస్తోంది.

సమంత, బాలీవుడ్ ఆక్టర్ వరుణ్ ధవన్ కాంబినేషన్లో వస్తున్న సిరీస్కు టైటిల్ ఫిక్స్ అయ్యింది. ‘సిటాడెల్: హనీ-బన్నీ’ పేరుతో ఈ సిరీస్ ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందులో మరో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా కీలక పాత్రలో నటించనున్నారు. రాజ్&డీకే దర్శకత్వం వహిస్తున్నాడు.ఇక ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news