సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా సమంత దూసుకుపోతోంది. వరుస హిట్లతో స్టార్ హీరోలకు ధీటుగా ఎదుగుతోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అయితే సమంత ఇప్పుడు అనుభవిస్తున్న స్టార్ స్టేటస్‌కు క్షణాల్లో వచ్చింది. దాని వెనుక పదేళ్ల కష్టం ఉంది. అందులో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. సినీ జీవితం, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొంది.
తాజాగా హైద్రాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. ఈ మేరకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించింది. తన జీవితంలోని చీకటి కోణాలపైనా స్పందించింది. సిద్దార్థ్ వ్యవహారాన్ని పరోక్షంగా టచ్ చేసింది.
సమంత, సిద్దార్థ్ కలిసి జబర్దస్త్ అనే చిత్రాన్ని చేశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది. అప్పటికే సిద్దార్థ్‌కు పెళ్లైంది కూడా అయితే ఆమెకు విడాకులు ఇచ్చి మరీ సమంతను పెళ్లి చేసుకోబోతోన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే వారి రిలేషన్ షిప్ మధ్యలోనే బ్రేక్ అయింది. ఈ విషయాన్నే ప్రస్థావిస్తూ.. తాను మరో సావిత్రిలా అయ్యేదాన్ని అని, అయితే ముందే గ్రహించానని, ఏదో చెడు జరగబోతోందని తెలుసుకున్నానని అందుకే ఆ రిలేషన్ షిప్‌ను బ్రేక్ చేసుకున్నానని తెలిపింది. తన అదృష్టం కొద్దీ చైతన్య దొరికాడని చెప్పుకొచ్చింది.