మళ్ళీ అదే తప్పు చేస్తున్న పూజా హెగ్డే … ఈసారి మాత్రం క్షమించరట ..?

-

టాలీవుడ్ లో ప్రస్తుతం పూజా హెగ్డే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ముకుందా సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన పూజా హెగ్డే ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలతో పూజా హెగ్డే మంచి పేరు వచ్చింది. దాంతో తెలుగ్య్లో వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు వచ్చాయి. కానీ అవన్ని కాదని బాలీవుడ్ మీద మోజుతో హృతిక్ రోషన్ నటించిన చారిత్రాత్మక సినిమాలో ఛాన్స్ అందుకొని బాలీవుడ్ వెళ్ళిపోయింది.

 

రెండేళ్ళు పాటు అక్కడే ఉండిపోయింది. అయితే ఆ సినిమా పూజా హెగ్డే కి గట్టి షాకిచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మొహంజాదారో భారీ డిజాస్టర్ అయింది. దాంతో బాలీవుడ్ లో పూజా ని ఎవరు పట్టించుకోలేదు. అయినా సరిగ్గా అదే సమయంలో టాలీవుడ్ నుండి అద్భుతమైన అవకాశం దక్కించుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన దువ్వాడ జగన్నాధం సినిమాలో నటించింది. ఆ సినిమాతో ఇక టాలీవుడ్ లో పూజా హెగ్డే వెనక్కి తిరిగి చూడలేదు. వరుసగా ఈ బ్యూటి నటిస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ టాలీవుడ్ లో ఇప్పుడు నంబర్ వన్ స్థానంలో ఉంది.

టాలీవుడ్ లో యమా బిజీగా ఉన్న పూజా హెగ్డేకి బాలీవుడ్ నుంచి ఇన్నాళ్ళకి మళ్ళీ ఆఫర్ వచ్చింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోయో సినిమాలో పూజా హెగ్డే ని రిఫెర్ చేశాడు సల్లు భాయ్. ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం నటిస్తున్న బచ్చన్ పాండే సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. ఫర్హద్ షామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుండగా మరో హీరోయిన్ గా పూజా హెగ్డే ని ఎంపిక చేశారట.

ఇద్దరు హీరోయిన్లు ఉన్నఈ సినిమాలో కృతి సనన్ కంటే పూజా హెగ్డే క్యారెక్టర్ ఎక్కువ హైలైట్ అవుతుందని బాలీవుడ్ మీడియా సమాచారం. ఈ సినిమా గనక హిట్ అయితే బాలీవుడ్ లో పూజా సెటిల్ అయినట్టే. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తున్న పూజా ఇప్పుడు అక్షయ్ కుమార్ తోనూ నటించబోతుంది. ఈ రెండు సినిమాలు గనక బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయితే ఇక టాలీవుడ్ కి టాటా చెప్పాలని అనుకుంటుందట పూజా హెగ్డే. అయితే గతంలో చేసిన తప్పే మళ్ళీ పూజా హెగ్డే చేస్తుందని టాలీవుడ్ లో ఫాం లో ఉన్నప్పుడు ఇక్కడ కాదని అక్కడికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ అంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news