టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నాళ్ల నుంచి శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాలకు సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు.
అలాగే, సమంత అనారోగ్యం బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ షూటింగ్ లో పాల్గొంటుంది. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటుంది. తాజాగా సామ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. హార్స్ రైడింగ్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ ‘మీరిద్దరూ అందంతో పాటు మృగం వంటివారు’ అనే క్యాప్షన్ ను జతచేసింది. సమంత గుర్రం స్వారీ చేస్తూ కనిపించడంతో అభిమానుడు ఫుల్ ఖుషిలో ఉన్నారు.