రూల్స్ బ్రేక్ చేసేసా.. ఇక అందరు షాక్ అవుతారు : సమంత

ప్రస్తుతం టాలీవుడ్ లో సృజనాత్మకతకు కేరాఫ్ అడ్రస్ గా ఉంది అక్కినేని వారి కోడలు సమంత ఓ వైపు నటనకు ప్రాధాన్యమున్న సినిమాలలో నటిస్తూ ఎంతగానో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సమంత మరోవైపు వెబ్ సిరీస్ ల వైపు కూడా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి సీజన్ ఎంతగానో విజయం సాధించిన ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ సీజన్ 2 నటిస్తోంది సమంత. వెబ్ సిరీస్ కోసం అభిమానులు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

ఇక ఈ వెబ్ సిరీస్ గురించి ఇటీవలే సమంత కీలక విషయం బయటపెట్టింది. ఈ వెబ్ సిరీస్ లో పాత్ర విషయంలో తాను రూల్స్ బ్రేక్ చేశానని.. మొదటిసారి నెగటివ్ పాత్రలో నటించానని ఈ వెబ్ సిరీస్ లో తన పాత్రను చూసి అందరూ షాక్ అవుతారు అంటూ సమంత చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం అభిమానులు అందరూ సమంత పాత్ర ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.