Samantha: పెళ్లి రోజూ సమంత ఎమోషన‌ల్ పోస్ట్.. అందులో ఏం చెప్పిందంటే..!

-

Samantha: ‘ఏమాయ చేశావే’ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో కాలుపెట్టిన హీరోయిన స‌మంత‌. ఆ సినిమా నాగ‌చైత‌న్య స‌ర‌స‌న న‌టించి మెప్పించింది స‌మంత. ఆ త‌రువాత‌ అత‌న్నే ప్రేమించింది. పెద్ద‌ల‌ను ఒప్పించి.. 2017లో అక్టోబర్‌ 6-7 తేదీల్లో హిందూ, క్రిస్టియ‌న్ సంప్రదాయాల్లో వివాహం చేసుకుంది. అక్కినేని వారి ఇంటి కోడ‌లైంది. కానీ, వారి వివాహా బంధం మూడునాళ్ల ముచ్చ‌టైంది. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా వివాహాబంధానికి స్వ‌స్తీ చెప్పారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుని అందరికి షాక్ ఇచ్చారు.

ఈ ప్ర‌క‌ట‌న త‌రువాత చైతూ చాలా సైలెంట్ అయ్యాడు. సోష‌ల్ మీడియాకు చాలా దూరంగా ఉన్నాడు. కానీ సామ్ ఎప్పటి లాగే సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంది. త‌న రియ‌ల్ లైఫ్‌కు రిలేటెట్ పోస్టుల‌ను చేస్తూ త‌న బాధ‌ను వ్య‌క్త‌ప‌రుస్తుంది. అయితే.. ఈ రోజు స‌మంత చైతూల జీవితంలో చాలా ముఖ్య‌మైన రోజు.. ఇవ్వాళ వారి నాల్గో వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ.

దీంతో స‌మంత గానీ , చైతూ గానీ ఏమైనా పోస్టులు పెడుతున్నారా అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ చూస్తున్నారు. కానీ, చైతన్య ఇప్ప‌టివ‌ర‌కూ అసలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేడు. సమంత మాత్రం పాత జ్ఞాపకాలు అంటూ సమంత సింగిల్ ఫొటో షేర్ చేస్తూ భావోద్వేగపు పోస్ట్ పెట్టి.. ఈ విధంగా రాసుకోచ్చింది.

పాత ప్రేమ పాటలు, పర్వతాలు.. శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని, కోల్పోయిన మరియు దొరికిన చిత్రాల పాటలు. లోయలో మెలంచోలిక్ ప్రతిధ్వని ధ్వని మరియు పాత ప్రేమికుల పాటలు. పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు మరియు సందులలో గాలి శబ్దం అంటూ తెల్లని డ్రెస్ ధరించి నేలపై చూస్తూ ఒంటరిగా నడుస్తున్న ఫొటో షేర్ చేసింది స‌మంత‌. https://www.instagram.com/p/CUtYnBYBhbA/

Read more RELATED
Recommended to you

Latest news