సామ్ జామ్ పేరుతో సమంత వచ్చేస్తుంది…

-

ఈ మధ్య సమంత పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. సినిమా షూటింగుల గురించి కాకపోయినా తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంది. మొన్నటికి మొన్న నాగార్జున గారు అందుబాటులో లేకపోవడంతో బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఐతే తాజాగా సమంత నుండి కొత్త టాక్ షో వచ్చేస్తుంది. సామ్ జామ్ పేరుతో వస్తున్న ఈ టాక్ షో ఆహాలో ప్రసారం కానుంది. ఈ మేరకు ఈ టాక్ షో గురించిన ప్రోమో వీడియో రిలీజైంది.

నవంబరు 13వ తేదీ నుండి ఈ టాక్ షో ప్రారంభం కానుందట. ప్రోమో వీడియోలో తన పెంపుడు కుక్క కుర్చీని ఉండగా, దాని మెడలో నవంబర్ 13 అని రాసి ఉంది. మనోడు కూడా డిసైడ్ అయిపోయాడు. లెట్ ద ఫన్ బిగిన్ అంటూ సమంత స్టార్ట్ చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సామ్ జామ్ టాక్ షోలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ వంటి స్టార్లు అతిధులుగా వస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news