శాకుంతలం మూవీ సీక్రెట్ గురించి చెప్పిన సమంత..!

-

సమంత ప్రధాన పాత్రలో.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శాకుంతలం. ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఇక సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్న సందర్భంగా సమంత సౌత్ తో పాటు నార్త్ లో కూడా ప్రమోషన్స్ చేస్తోంది. ఒకరకంగా చెప్పాలి అంటే సౌత్లో కంటే నార్త్ లోనే మార్కెట్ సమంత ను చూసి జరుగుతున్నట్టు వుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో సినిమా బడ్జెట్ గురించి అందరూ అనుకుంటున్న మాట బయటపెట్టారు సమంత . నిజానికి సినిమా మొదలు పెట్టడానికి అనుకున్న బడ్జెట్ కంటే పూర్తి చేసేసరికి ఎక్కువైందని సమంత తెలిపారు.

ప్రస్తుతం శాకుంతలం సెట్స్ మీద ఉన్నప్పుడు బయటకు వచ్చిన మేకర్స్ అలాంటిదేమీ లేదు అన్నట్టు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు సమంత ఈ విషయం చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో ఇంత బడ్జెట్ తో వస్తున్న సినిమా ఇదే అంటుంది సమంత. అంతేకాదు సినిమా నన్ను నమ్మి చేస్తున్నప్పుడు వారికి పూర్తి సహకారం అందించాల్సిందే కదా యశోద టైం లో బయటికి రాని నేను ఈ సినిమా కోసం బయటకు రావడం జరిగింది అంటూ చెప్పుకొచ్చింది.

మొత్తానికైతే సమంత ఈ సినిమాకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిందని చెప్పాలి.. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్ , పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి కచ్చితంగా ఈ సినిమా వారి బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి సమంత ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news