టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఈమెకు సంబంధించిన ఏదో ఒక వార్త నిత్యం వైరల్ గా మారుతూనే ఉంటుంది. సమంత అనారోగ్యానికి గురైన దగ్గర్నుంచి ఎక్కువగా అభిమానులు ఆమెపై ఫోకస్ పెట్టారు. సమంత కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాకి, అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇటీవలే యశోద సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సమంత ఇప్పుడు శాకుంతలం సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ , టీజర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇదిలా ఉండగా సమంత ఒక షూటింగ్లో గాయాల పాలైన విషయం తెలిసిందే. ఆమె చేతికి గాయాలయ్యాయి. ఈ విషయాలన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా ఆ ఫోటో చూసిన వారంతా ఆందోళన వ్యక్తం చేశారు.
Wowww🫶🏻
This is some talent 😍#Shaakuntalam https://t.co/U8Kz2T2w81— Samantha (@Samanthaprabhu2) March 17, 2023
ఇకపోతే సమంతకి తాజాగా ఒక అభిమాని ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. దెబ్బ తగిలిన శ్యామ్ చేతులను అందంగా బొమ్మ గీసింది.. ఈ పెన్సిల్ ఆర్ట్ ను షేర్ చేస్తూ.” నేను మీ సక్సెస్ కి మాత్రమే ఫ్యాన్ ని కాదు.. మీ హార్డ్ వర్క్.. కమిట్మెంట్ కి ఫ్యాన్.. ఈ గిఫ్ట్ ను 25 మిలియన్స్ రీచ్ అయినప్పుడు గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాను.. కానీ కుదరలేదు.. అందుకే ఇప్పుడు ఇస్తున్నా.. అది మీకు నచ్చుతుంది అని అనుకుంటా ” అని రాసుకొచ్చింది ఈ పోస్ట్ కు సమంతా రియాక్ట్ అవుతూ థాంక్యు మై లవ్ అంటూ రిప్లై ఇచ్చింది.
View this post on Instagram