అరుదైన రికార్డు సొంతం చేసుకున్న సమంత.. ప్రపంచంలోనే 8వ స్థానం..!

-

ప్రస్తుతం దాదాపు అన్ని సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటుంటే ..ఈ సినిమాల మధ్య సమంత నటించిన తాజా చిత్రం “యశోద” బాక్సాఫీస్ వద్ద ఎక్సలెంట్ స్టార్ట్ సొంతం చేసుకుంది. మొదటి రోజు అనుకున్న అంచనాలకు మించి కలెక్షన్ సొంతం చేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా మొదటి రోజే రూ.3 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటిగా నిలవడం నిజంగానే ఎక్స్లెంట్ అచీవ్మెంట్ అని చెప్పవచ్చు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓపెనింగ్స్ ని అందుకున్న టాప్ మూవీస్ లో యశోద సినిమా టాప్ 8 వ ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇండియాలో “బ్లాక్ పాంథర్” సినిమా జోరు చూపించినా కానీ మిగిలిన సినిమాల్లో టాప్ టు ప్లేస్ ను సొంతం చేసుకొని అదరగొట్టేసింది యశోద సినిమా.ఈ సినిమాకు ఎలాగో పాజిటివ్ టాక్ ఆడియోస్ నుంచి వస్తోంది కాబట్టి వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ సొంతం చేసుకునే అవకాశం కనిస్తోంది. తర్వాత వర్కింగ్ డేస్ హోల్డ్ ను బట్టి సినిమా ఎంత దూరం వెళుతుంది అన్నది చెప్పగలం. ఏది ఏమైనా ఈ సినిమా సక్సెస్ తో సమంత మొదటి మెట్టు ఎక్కిందని చెప్పాలి.

విభిన్నమైన పాత్రలను ఎంచుకొంటూ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు . సమంత నటించిన మరొక పౌరాణిక చిత్రం శాకుంతలం కూడా త్వరలోనే విడుదలకు సిద్ధం కాబోతోంది .. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news