SAMMATHAME MOVIE: లుంగీ గెటప్ లో కిరణ్ అబ్బవరం… ”సమ్మతమే” ఫస్ట్ లుక్ అదుర్స్…

-

“రాజావారు రాణిగారు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం…. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజావారు రాణి గారు సినిమా తర్వాత “ఎస్ ఆర్ కళ్యాణ మండపం” సినిమా చేసాడు. ఇందులో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే నెల 6న రిలీజ్ కానుంది.

అటు ఈ మూవీ చేస్తూనే మరో మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు ఈ యంగ్ హీరో. తాజాగా కిరణ్ అబ్బవరం నటిస్తున్న “సమ్మతమే” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది ఈ చిత్ర బృందం. ఈ చిత్రానికి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా…. కలర్ ఫోటో సేమ్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే…. ఈ సినిమా మొత్తం గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథగా తెలుస్తోంది. ఇందులో కిరణ్‌ గ్రామంలోని ఇంటి వరండాలో కూర్చుని అద్దంలో తనను తాను చూసుకుంటూ నవ్వుతున్న యువకుడిగా కనిపిస్తుండగా… అతన్ని చూస్తూ.. ఎఫెక్షన్‌ ఫీల్‌ అవుతూ చాందీని చౌదరి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news