ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్.. గెలాక్సీ ఎ52ఎస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. 6.5 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు.
ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 778జి ప్రాసెసర్‌ను అమర్చారు. అందువల్ల 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. 6/8 జీబీ ర్యామ్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను పొందవచ్చు. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది.
ఈ ఫోన్లో వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడుగా మరో 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్లో లభిస్తుంది. ఐపీ 67 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్లో 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇతర ఫీచర్లను కూడా అందిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఎ52ఎస్ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.35,999 ఉండగా, 8జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.37,499గా ఉంది. ఈ ఫోన్‌ను శాంసంగ్ ఆన్లైన్ స్టోర్‌తోపాటు ఇతర అన్ని ఆన్లైన్ స్టోర్స్, రిటెయిల్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్ కింద హెచ్డీఎఫ్సీ కార్డులతో ఈ ఫోన్‌పై రూ.3000 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు.