సోషల్‌మీడియాలో నకిలీ వార్తలపై సుప్రీం కోర్టు సీరియస్

-

సోషల్ మీడియా, వెబ్ పోర్టల్ లో నకిలీ మరియు తప్పుడు వార్తలు పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కొన్ని మాధ్యమాల్లో ప్రతి విషయాన్ని మమత కోణంలోనే చూపుతున్నారని… దీని వల్ల దేశానికి చెడ్డపేరు వస్తోందని పేర్కొంది. సామాజిక మాధ్యమ సంస్థలు కేవలం బలవంతులకు స్పందిస్తున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మాధ్యమ సంస్థలు సామాన్య ప్రజల కష్టాలను అసలు పట్టించుకోవడం లేదని ఫైల్ అయింది సుప్రీం కోర్ట్. తబ్లీగి జమాత్‌ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. సోషల్‌మీడియా, వెబ్‌ పోర్టళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

‘‘దేశంలో ప్రతి విషయాన్ని మత కోణంలో చూపుతున్నారు. ఇది దేశంపై దుష్ప్రభావం చూపుతోంది. సోషల్‌మీడియా, వెబ్‌ పోర్టళ్లలో కంటెంట్‌ విషయంలో జవాబుదారీతనం కన్పించట్లేదు. వీటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. సామాజిక మాధ్యమాలు దేన్నయినా ప్రచురించగలుగుతున్నాయి. ఎవరైనా యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించే అవకాశం ఉంది. నియంత్రణ వ్యవస్థ లేక వ్యక్తుల పరువుకు నష్టం జరుగుతోంది. వ్యవస్థలు, న్యాయమూర్తులను కూడా చెడుగా చూపిస్తున్నారు’’ అని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అసహనం వ్యక్తం చేశారు.

సోషల్‌మీడియా సంస్థలు కేవలం బలవంతుల మాటలనే వింటున్నాయని, ఎలాంటి జవాబుదారీతనం లేకుండా వ్యవస్థలు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేస్తున్నాయని జస్టిస్‌ రమణ ఆగ్రహించారు. సామాజిక మాధ్యమ వేదికలు సామాన్యులకే కాదు.. న్యాయమూర్తులకు కూడా స్పందించట్లేదని అన్నారు. ఈ పరిణామాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఐటీ నిబంధనలపై అన్ని హైకోర్టుల్లో దాఖలపై పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ధర్మాసనం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news