అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో గెలాక్సీ ఎం31ఎస్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

-

శాంసంగ్ కంపెనీ భార‌త్‌లో గెలాక్సీ ఎం31ఎస్ పేరిట మ‌రో కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం విడుద‌ల చేసింది. ఎం సిరీస్‌లో వ‌చ్చిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-ఓ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 8జీబీ వ‌ర‌కు ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 64 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న మెయిన్ కెమెరాతోపాటు మ‌రో 12 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌, 5 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌ల‌ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.

Samsung Galaxy M31s  smart phone launched in india

గెలాక్సీ ఎం31ఎస్ ఫోన్‌లో సింగిల్ టేక్‌తోనే ఒకేసారి 7 ఫొటోలను, 3 వీడియోల‌ను తీసుకోవ‌చ్చు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ప‌క్క‌న ఏర్పాటు చేశారు. రెండు సిమ్‌లు, ఒక మెమొరీ కార్డు వేసుకునేందుకు మొత్తం 3 స్లాట్ల‌ను ఇందులో ఇచ్చారు. 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఇందులో ఏర్పాటు చేశారు. దీనికి 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అలాగే రివ‌ర్స్ చార్జింగ్ ఫీచ‌ర్ ఉన్నందున ఇత‌ర ఫోన్ల‌ను ఈ ఫోన్ స‌హాయంతో చార్జింగ్ కూడా చేయ‌వ‌చ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్పెసిఫికేష‌న్లు…

* 6.5 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 2400 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
* 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్
* 64, 12, 5, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, 32 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాలు
* సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డాల్బీ అట్మోస్‌
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ టైప్ సి, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్ మిరేజ్ బ్లాక్‌, మిరేజ్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌రను రూ.19,499గా నిర్ణ‌యించారు. అలాగే 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర‌ను రూ.21,499గా నిర్ణ‌యించారు. ఆగ‌స్టు 6 నుంచి ఈ ఫోన్‌ను అమెజాన్‌లో విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news