Samsung Galaxy Note 10 : పండగ వచ్చేసింది

-

సామ్‌సంగ్‌ ప్రతిష్టాత్మక నోట్‌ 2019 ఫోన్‌, ‘గెలాక్సీ నోట్‌ 10’ నేటి అర్ధరాత్రి విడుదల కానుంది. యాపిల్‌ ఐఫోన్‌ తర్వాత, అత్యంత ప్రజాదరణ కలిగిన ఆండ్రాయిడ్‌ ఫోన్లుగా గెలాక్సీ ఎస్‌ సిరీస్‌, నోట్‌ సిరీస్‌ పేరెన్నికగన్నవి. 2019 నోట్‌ ఫోన్‌ మరిన్ని హంగులు జోడించుకుని రాబోతున్నట్లుగా ఇప్పటికే పలు లీకుల ద్వారా తెలిసింది.

ఈ సంవత్సరపు నోట్‌ ఫ్లాగ్‌షిప్‌ను విడుదల చేయడానికి సామ్‌సంగ్‌ రంగం సిద్ధం చేసింది. భారత కాలమానం ప్రకారం, నేటి అర్ధరాత్రి 1.30 గం.లకు న్యూయార్క్‌లో తమ కొత్త నోట్‌ సిరీస్‌ ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఈ నోట్‌ సిరీస్‌లో నోట్ 10, నోట్‌ 10+లను సామ్‌సంగ్‌ అధికారికంగా ప్రకటించబోతోంది. ఈ ఫోన్లకు సంబంధించి సామ్‌సంగ్‌ ఏమీ చెప్పకుండా గుంభనంగా ఉన్నప్పటికీ, వీటిలో ఉన్న పలు విశేషాలు, సౌలభ్యాలు ఇప్పటికే చాలా వెబ్‌సైట్లలో లీకుల రూపేణా వచ్చేసాయి.

విశ్వసనీయ సమాచారం మేరకు, గెలాక్సీ నోట్‌ 10, నోట్‌ 10+, ఇంకా నోట్‌ 10+ 5జి రకాలను ‘సామ్‌సంగ్‌ అన్‌ప్యాక్‌డ్‌’ ఈవెంట్‌లో ఈ రాత్రి లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు నోట్‌ 10ఈ మోడల్‌ కూడా ఒకటి ఉన్నట్లు విశ్లేషకుల అంచనా. 5జి నమూనా ముమ్మూర్తులా నోట్‌10+నే పోలిఉంటుంది. ఒకే తేడా… 5జి రేడియో.

Samsung Galaxy Note 10 Price in India

ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే, లీకుల ద్వారా చాలా విశేషాలే ఉన్నాయి. ముందుగా ఆపరేటింగ్‌ సిస్టమ్‌.. ఎస్‌10 లానే ఆండ్రాయిడ్‌ పై (9.0), దానిపై సామ్‌సంగ్‌ వన్‌ యూఐ ఉంటాయి. ఈ ఫోన్లలో డిస్‌ప్లే 6.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి+ (1080 ఘ 2280 పిక్సెల్‌) డైనమిక్‌ అమోలెడ్‌తో ఉంటుంది. ఇక ప్రాసెసర్‌, సామ్‌సంగ్‌ ఇవాళే విడుదల చేసిన ఎక్సినోస్‌ 9825 లేదా స్నాప్‌డ్రాగన్‌ 855 చిప్‌సెట్‌తో లభించనుంది. బ్యాటరీ, నోట్‌ 10లో 3500 ఎంఏహెచ్‌, 10+లో 4300ఎంఏహెచ్‌, ర్యామ్‌ 8జిబి, స్టోరేజి 256జిబి(బిల్టిన్‌) ఉండే అవకాశముంది. కెమెరాలు వెనుకవైపు మూడు ఉంటాయి. 12ఎంపి, 16ఎంపి, 12ఎంపి టెలిఫోటో లెన్స్‌తో, ముందువైపు 10మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఉంటాయి.

నోట్‌ సిరీస్‌ ఫోన్లకు ప్రత్యేకమైన స్టైలస్‌ – ఎస్‌ పెన్‌ పేరుతో ఉంటుంది. ఈసారి దానికి కూడా కొన్ని ప్రత్యేకతలు జోడించారని తెలుస్తోంది. నోట్‌10+లో దాదాపు అన్ని నోట్‌10 వే ఉన్నా, పరిమాణం దానికన్నా పెద్దది. డిస్‌ప్లే 6.8 అంగుళాల క్వాడ్‌-హెచ్‌డి+ (1440 ఘ 3040 పిక్సెల్‌) డైనమిక్‌ అమోలెడ్‌ తెరతో పాటు, 4300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 12జిబి ర్యామ్‌ అదనంగా ఉంటాయి. 5జి మోడల్‌ ఇవే లక్షణాలతో, 5జి రేడియో అదనంగా కలిగిఉంటుంది.

ధరల విషయానికొస్తే, నోట్‌10, ప్రారంభ ధర దాదాపు 75వేలుగా, నోట్‌10+ ధర 90 వేలుగా ఉండే అవకాశముంది. సామ్‌సంగ్‌ అన్‌ప్యాక్‌డ్‌ ఈవెంట్‌ను ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించాలనుకునేవారు సామ్‌సంగ్‌ వెబ్‌సైట్‌లో, యూట్యూబ్‌లోనూ చూడవచ్చు.

గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్ల‌స్‌, నోట్ 10 ప్ల‌స్ 5జీ వేరియెంట్ల ధ‌ర‌లు అమెరికా మార్కెట్‌ను బ‌ట్టి ఇలా ఉన్నాయి.

  •  శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 (8 జీబీ, 256 జీబీ) – 949.99 డాలర్లు (దాదాపుగా రూ.67,520)
  •  శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ (12 జీబీ, 256 జీబీ) – 1099.99 డాలర్లు (దాదాపుగా రూ.78,180)
  •  శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ (12 జీబీ, 512 జీబీ) – 1199.99 డాలర్లు (దాదాపుగా రూ.85,290)
  •  శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ 5జీ (12 జీబీ, 256 జీబీ) – 1299.99 డాలర్లు (దాదాపుగా రూ.92,400)
  •  శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ 5జీ (12 జీబీ, 512 జీబీ) – 1399.99 డాలర్లు (దాదాపుగా రూ.99,505)

కాగా గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ ఫోన్లను ఆగస్టు 23వ తేదీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా విక్రయించనున్నారు. గెలాక్సీ నోట్ 10 ప్లస్ 5జీ వేరియెంట్ కూడా అదే తేదీ నుంచి కేవలం అమెరికా మార్కెట్‌లోనే లభ్యం కానుంది. కాగా ఈ ఫోన్లకు గాను గురువారం నుంచే ప్రీ ఆర్డర్లను షురూ చేశారు. ఈ నెల 22వ తేదీ వరకు ప్రీ ఆర్డ‌ర్లు కొనసాగుతాయి. ఇక గెలాక్సీ నోట్ 10 సిరీస్ ఫోన్లు భారత్‌లో ఈ నెల‌ 20వ తేదీన విడుదలవుతాయ‌ని తెలుస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ ఫీచర్లు…

  •  నోట్ 10 – 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్
  •  నోట్ 10 ప్లస్ – 6.8 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 3040 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్
  •  ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్/ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9825 ప్రాసెసర్
  •  నోట్ 10 – 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్
  •  నోట్ 10 ప్లస్ – 12జీబీ ర్యామ్, 256/512 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
  •  ఆండ్రాయిడ్ 9.0 పై, సింగిల్/హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
  •  నోట్ 10 – 12, 12, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
  •  నోట్ 10 ప్లస్ – 12, 12, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, వీజీఏ డెప్త్ విజన్ కెమెరా
  •  10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
  •  డాల్బీ అట్మోస్, యూఎస్‌బీ టైప్ సి ఆడియో
  •  అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, బారో మీటర్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
  •  వైఫై 802.11 ఏఎక్స్, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
  •  నోట్ 10 – 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్
  •  నోట్ 10 ప్లస్ – 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ల ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్

– చంద్రకిరణ్‌

Read more RELATED
Recommended to you

Latest news