అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో.. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ఫోన్లు..!

-

ప్ర‌తి ఏడాది లాగే శాంసంగ్ ఈ ఏడాది కూడా త‌న నూత‌న గెలాక్సీ నోట్ ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. ఈ సారి నోట్ సిరీస్‌లో గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్ల‌స్‌ల‌తోపాటు నోట్ 10 ప్ల‌స్ 5జీ వేరియెంట్‌ను కూడా శాంసంగ్ లాంచ్ చేసింది.

ప్ర‌తి ఏడాది లాగే శాంసంగ్ ఈ ఏడాది కూడా త‌న నూత‌న గెలాక్సీ నోట్ ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. ఈ సారి నోట్ సిరీస్‌లో గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్ల‌స్‌ల‌తోపాటు నోట్ 10 ప్ల‌స్ 5జీ వేరియెంట్‌ను కూడా శాంసంగ్ లాంచ్ చేసింది. అయితే నోట్ 10 ప్ల‌స్‌లో ఉన్న ఫీచ‌ర్లే నోట్ 10 ప్ల‌స్ 5జీ వేరియెంట్‌లోనూ ఉంటాయి. కానీ 5జీ ఫీచ‌ర్ ఒక్క‌టే 5జీ వేరియెంట్‌లో ఉంటుంది. ఇక గెలాక్సీ నోట్ ఫోన్ల‌ను అద్భుత‌మైన డిజైన్ల‌తో తీర్చి దిద్దారు. వీటి లుక్ బాగుంటుంది. నోట్ 10లో 6.3 ఇంచుల డిస్‌ప్లే ఉండ‌గా, నోట్ 10 ప్ల‌స్‌లో 6.8 ఇంచుల డిస్‌ప్లే ఉంటుంది. రెండు ఫోన్ల‌లోనూ ముందు భాగంలో పంచ్ హోల్ కెమెరాను ఏర్పాటు చేశారు.

samsung launched galaxy note 10 series phones

కాగా నోట్ 10, నోట్ 10 ప్ల‌స్ ఫోన్లు రెండింటిలోనూ డిస్‌ప్లే కింద అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. యాంటీ స్పూఫింగ్ ఫీచ‌ర్‌ను ఈ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ క‌లిగి ఉంది. దీంతో యూజ‌ర్ చేతివేళ్లు కాకుండా ఆ ముద్ర‌ల‌ను పెడితే డివైస్ అన్‌లాక్ అవ‌దు. కేవ‌లం వేళ్ల‌నే పెట్టి డివైస్‌ను అన్‌లాక్ చేయాల్సి ఉంటుంది. నోట్ 10 ఫోన్లతో ఎస్ పెన్ అన‌బ‌డే ఓ స్టైల‌స్‌ను అందిస్తున్నారు. ఇది బ్లూటూత్‌తో ప‌నిచేస్తుంది. దీన్ని ఒక్క‌సారి ఫుల్ చార్జింగ్ చేస్తే 10 గంట‌ల వ‌ర‌కు వాడుకోవ‌చ్చు. ఇక అచ్చం యాపిల్ ఐప్యాడ్‌ల‌కు ఇచ్చే పెన్సిల్ మాదిరిగానే ఎస్ పెన్ ప‌నిచేస్తుంది. దీంతో ఫోన్‌లో టెక్ట్స్ రాసుకోవ‌చ్చు. గ్రాఫిక్స్ డ్రా చేయ‌వ‌చ్చు. ఆ ఫైల్స్‌ను వ‌ర్డ్‌, జేపీఈజీ, పీడీఎఫ్ డాక్యుమెంట్ల రూపంలోకి క‌న్వ‌ర్ట్ చేసుకోవ‌చ్చు.

నోట్ 10, నోట్ 10 ప్ల‌స్ ఫోన్ల‌లో రెండు ర‌కాల ప్రాసెస‌ర్లు ఉంటాయి. స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్ లేదా ఎగ్జినోస్ 9825 ప్రాసెస‌ర్‌లు ఉంటాయి. మార్కెట్‌ను బ‌ట్టి వీటిలో ఏదో ఒక ప్రాసెస‌ర్ క‌లిగిన నోట్ 10 ఫోన్లు ఆయా దేశాలను బ‌ట్టి యూజ‌ర్ల‌కు ల‌భిస్తాయి. ఇక నోట్ 10 ప్ల‌స్ 5జీ వేరియెంట్‌లో 5జీ కోసం అద‌నంగా స్నాప్‌డ్రాగ‌న్ ఎక్స్‌50 మోడెమ్‌ను ఏర్పాటు చేశారు. నోట్ 10లో వెనుక భాగంలో 12, 16, 12 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు ఉంటాయి. వీటిలో ఒక 12 మెగాపిక్స‌ల్ కెమెరా టెలిఫోటో కెమెరాగా ప‌నిచేస్తుంది. ముందు భాగంలో 10 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. కాగా నోట్ 10 ప్ల‌స్‌లో ఈ కెమెరాల‌తోపాటు అద‌నంగా వెనుక భాగంలో 3డీ కెమెరా ఉంటుంది. దీంతో 3డీ ఎమోజీల‌ను, గ్రాఫిక్స్‌ను రూపొందించుకోవ‌చ్చు.

గెలాక్సీ నోట్ 10 ఫోన్ల‌లో ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్ వ‌స్తుంది. శాంసంగ్ బిక్స్‌బీ వాయిస్ అసిస్టెంట్‌, శాంసంగ్ హెల్త్‌, శాంసంగ్ పే, శాంసంగ్ డెక్స్ సేవ‌ల‌ను కూడా అందుబాటులో ఉంచారు. శాంసంగ్ డెక్స్‌తో నోట్ 10 ఫోన్ల‌ను పీసీ లేదా మాక్‌ల‌కు సుల‌భంగా క‌నెక్ట్ చేసుకుని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ ఫోన్ల‌కు ముందు, వెనుక గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. వీటికి ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ ను కూడా అందిస్తున్నారు.

గెలాక్సీ నోట్ 10లో 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. నోట్ 10 ప్ల‌స్‌లో 4300 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీ ఉంటుంది. వీటికి ఫాస్ట్ చార్జింగ్‌, ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్‌, వైర్‌లెస్ పవర్‌షేర్, క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. నోట్ 10 ప్ల‌స్‌కు అందిస్తున్న సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ వ‌ల్ల ఫోన్‌ను కేవ‌లం 30 నిమిషాల పాటు చార్జ్ చేసినా చాలు రోజంతా ఉప‌యోగించుకునేందుకు కావ‌ల్సిన బ్యాట‌రీ లైఫ్ ల‌భిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news