ఎనిమిది ఏండ్ల వయస్సులో ఆ అబ్బాయి ఓ అమ్మాయిని చూశాడు. అప్పుడే ఆమెపై మనసు పారేసుకున్నాడు అతను. ఆ వయస్సులో ప్రేమ అంటే ఆకర్షణే అనుకుంటాం. అయినా అతను ఆమెనే చూస్తూ పెరిగాడు. ఆమెకు తెలియకుండా ప్రేమ పెంచుకున్నాడు. కాలం గడిచింది. రోజులు మారాయి. మరి అతని ప్రేమ ఏమయింది? అతనికి 39 ఏండ్లు వయసొచ్చింది. 49 ఏండ్ల అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. ఆమె ఎవరో కాదు. చిన్నప్పుడు అతని మనసు దోచేసిన చిన్నదే.
ఇదేదో సినిమాను తలపించే కథలా ఉంది అనుకుంటున్నారా? సినిమా కథ కాదు గానీ హాలీవుడ్ చెందిన హిరో, హీరోయిన్ ప్రేమ కథ. ఇటీవల హాలీవుడ్లో రిలీజైన అక్వామెన్ హీరో జాసన్ మొమోవా, అమెరికన్ టీవీ నటి లీసా బొనెట్ ప్రేమ కథ..
‘అమెరికాలోని హువాయి శివారు ప్రాంతం.1987. అప్పుడు జాసన్ ఎనిమిదేండ్లు. తండ్రి ప్రముఖ ఫొటోగ్రాఫర్. తల్లి పెయింటర్. అప్పటి వరకూ అతను తల్లి చాటు బిడ్డలా పెరుగుతున్నాడు. పెయింటింగ్ నేర్చుకున్నాడు. జీవితంలో పెయింటర్ స్థిరపడాలనుకున్నాడు. యాక్టర్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అతను ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమ గెలుచుకోవడానికి పెయింటర్ నుంచి యాక్టింగ్ మారాడు. ప్రియురాలినే ఆదర్శంగా తీసుకుని బుల్లితెరవైపు అడుగులేశాడు. ఆ అడుగులు తన ప్రియురాలి దగ్గరకు తీసుకెళ్లాయి.
తొలి చూపు ప్రేమ..
ఓ రోజు ఇంట్లో టీవీ చూస్తుండగా మొదటి సారి లీసాను చూశాడు. ప్రముఖ చానెల్ ‘ద కాస్బీ షో’ కామెడీ సిరీస్ నటిస్తున్నది లీసా. అతనిలాగే ఉండే ఉంగరాలు తిరిగిన కురులు, కండ్లలో ఓ ఆకర్షన, నాజూకైన ఆకృతి. ఇంకుముంది ప్రేమలో పడిపోయాడు. జాసన్ వెళ్లి వెంటనే తన తల్లికి చెప్పాడు. ‘నేను ఆమెను ప్రేమిస్తున్నాను, లీసానే పెళ్లి చేసుకుంటాన’ని తేల్చేసాడు. తర్వాత ఆమెను కలుసుకోవడానికి ప్రయత్నాలు చేశాడు. అతని పాఠశాల విద్య అయిపోయిన తర్వాత హువాయి నగరానికి చేరుకున్నాడు. బేవాట్చ్ (1989) టీవీ సిరీస్ మొదటిసారి పాల్గొన్నాడు. ఆ షో చేస్తూనే పది సీసన్లు పూర్తి చేశాడు. దీంతో జాసన్ పాపులారిటీ పెరిగింది. తర్వాత వివిధ షోలలో, సినిమాల్లో కాలం గడిపాడు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే తన ప్రియురాలు లీసా బొనెట్ కలుసుకునే అవకాశం వచ్చింది…
కలుసుకున్నారిలా..
పది సంవత్సరాల సిరీస్ తర్వాత జాసన్ బయట ప్రపంచంలో విహరించాలనుకున్నాడు. అలా తన జీవితాన్ని గడుపుతున్న క్షణంలో తన కలల సుందరిని కలుసుకున్నాడు. ఇద్దరి కామన్ ఫ్రెండ్ కారణంగా న్యూయార్క్ ఓ హోటల్ 2005లో జాసన్, లీసాకు మొదటి సారి పరియం ఏర్పడింది. ఆ పరిచయే ఇద్దరి మధ్య ప్రేమగా మారి, పెండ్లి వరకూ వెళ్లింది. ఆ సమయంలో జాసన్ ఆనందానికి అదుపు లేదు. చిన్ననాటి నుంచి ప్రేమించిన వ్యక్తి ఎదురుపడిందన్న సంతోషం ఆయన బలవంతంగా ఆపుకున్నాడు. టీవీల్లో ఆ సుందరినీ చూస్తూ పెరిగాడు. ఇప్పుడు తనతో మాట్లాడబోతున్నాడన్న సంగతి తలుచుకుంటే అతని ఆనందానికి అవదులు లేనట్టు భావించాడు. ఆలస్యం చేయకుండా లీసాతో మాట కలిపాడు. తనతో కలిసి భోజనం చేయాలని కోరాడు. దీనికి లీసా ఒప్పుకుంది.
జాసన్ ఆశ్చర్యానికి గురయ్యాడు. అతను ఇద్దరు భోజనాన్ని ఆర్డర్ చేశారు. లీసా తనకు ఇష్టమైన ఆర్డర్ చేసింది. గిన్నీస్ అనే ఒక రకమైన బీర్ అది . ఆశ్చర్యమేంటంటే జాసన్ ఇష్టపడేది కూడా గిన్నీస్ మరోసారి ఆశ్చర్యానికి గురైన జాసన్ తేరుకోవడానికి కొస్త సమయం పట్టింది. ఆకట్టుకునే స్వభావం ఉన్న జాసన్ మాటలు లీసాను కట్టిపడేసాయి. ఇలా వారి పరియం బలపడింది. తర్వాత రోజుల్లో ఇద్దరూ కలుసుకోవడాలు, విందులకు హాజరవడాలు సాధారణంగానే జరిగాయి. ఇలా జాసన్ ప్రేమకు అడుగులు ముందుకు పడ్డాయి. సమయం చూసి జాసన్ తన ప్రేమ విషయాన్ని లీసాకు వ్యక్తపరిచాడు.
తనతో కలిసి జీవించడానికి ఒప్పించాడు. అప్పటి నుంచి వారి ప్రేమ ప్రయాణం మొదలైంది. కొద్ది రోజుల్లోనే హాలీవుడ్ చక్కటి జంటగా నిలిచారు ఈ ఇద్దరు. ‘మేము సరైన సమయంలో, సరైన ప్రాంతంలో కలుసుకున్నాం. జాసన్ నాకు భాగస్వామే కాదు నా జీవితానికి హీరో. నా పిల్లలకు తండ్రిలా ఎలా ఉంటాడో నాతో కూడా అలాగే ఉంటాడు.నాకు తల్లి లాంటి గౌరవాన్ని ఇస్తాడు’ అంటోంది లీసా. జోసెన్ తన ప్రేమ గురించి ఇలా చెప్తాడు.. ‘ నేను అమెను చూసినప్పుడు ఆమె వెంట్రుకలు కూడా నా వెంట్రుకలలాగే దట్టంగా ఉండేవి. అందుకే వాటిని అలాగే భయంకరంగా పెంచాను. ఈ వెంట్రుకలే ఇప్పుడు తనకు ఇష్టం. ఒకవేళ నేను వాటిని కత్తిరిస్తే నా భార్య నన్ను వదిలేస్తుందేమో. నేను చిన్నప్పటి నుంచి తండ్రి కావాలని కలలుగన్నాను. నా భార్యను, పిల్లలను అమితంగా ప్రేమించటం నాకు ఇష్టం’ అంటాడు జోసెన్..
2017లో పెండ్లి..
2005 ప్రేమికులుగా ఒక్కటైకలిసి జీవించారు. ప్రేమలో సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2017 పెండ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు సాక్ష్యంగా లీసా 2007 లోలా లోలాని మొమోవాకు అనే పాపకు జన్మనిచ్చింది. 2008లో జాసన్ మరో పాప జన్మించింది. హాలీవుడ్ వీరి ప్రేమను, కుటుంబ జీవితాన్ని రహస్యంగా ఉంచారు. కానీ 2017లో అధికారికంగా పెండ్లి చేసుకున్నారు. ఆతర్వాత మీడియ ద్వారా వారి ఇద్దరి జీవిత విశేషాలను, కుటుంబ విశేషాలను తెలియజేశారు. ఇద్దరమూ చాలా సంతోషంగా ఉన్నామనీ, తమ ప్రేమ బలమైనదని అంటున్నారు ఈ దంపుతులు..