గుడ్‌న్యూస్‌.. గెలాక్సీ A51, A71, A31, A21s, M01s‌, M01 ఫోన్ల ధ‌ర‌లు త‌గ్గాయ్‌..!

-

భార‌త్‌లోని స్మార్ట్ ఫోన్ క‌స్ట‌మ‌ర్ల‌కు శాంసంగ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్ప‌టికే గెలాక్సీ నోట్ 20 స్మార్ట్ ఫోన్ ధ‌ర‌ను త‌గ్గించిన శాంసంగ్ తాజాగా మ‌రిన్ని ఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. శాంసంగ్ ఫెస్టివ్ డేస్ కింద ఈ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కొత్త‌గా ఫోన్ల‌ను కొనుగోలు చేసే వారికి ఈ ధ‌ర‌ల త‌గ్గుద‌ల ఎంతో మేలు చేయ‌నుంది.

samsung slashed prices of galaxy phones

శాంసంగ్ సంస్థ త‌న గెలాక్సీ ఎ51. ఎ71, ఎ21ఎస్‌, ఎం01ఎస్, ఎం01 ఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో త‌గ్గించిన ధ‌ర‌ల‌కే ఆయా ఫోన్ల‌ను ప్ర‌స్తుతం విక్ర‌యిస్తున్నారు. ఇక ధ‌రలు త‌గ్గాక ఆ ఫోన్ల తాజా రేట్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

* గెలాక్సీ ఎ51 ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.23,999 ఉండ‌గా, ఈ ఫోన్ ఇప్పుడు రూ.1వేయి త‌గ్గింపుతో రూ.22,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. ఇదే ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.25,999 ఉండ‌గా.. రూ.1500 త‌గ్గింపుతో ఈ వేరియెంట్ రూ.24,499 ధ‌ర‌కు ల‌భిస్తోంది.

* గెలాక్సీ ఎ71 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.30,999 ఉండ‌గా.. దీని ధ‌ర కూడా రూ.1500 తగ్గింది. దీంతో ఈ వేరియెంట్‌ను రూ.29,499 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

* గెలాక్సీ ఎ31కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.20,999 ఉండ‌గా.. ఇదిప్పుడు రూ.19,999కు ల‌భిస్తోంది.

* గెలాక్సీ ఎ21ఎస్ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.15,999 ఉండ‌గా.. ఇదిప్పుడు రూ.14,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. ఇదే ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.17,499 ఉండ‌గా.. ఇదిప్పుడు రూ.16,499 ధ‌ర‌కు ల‌భిస్తోంది.

* గెలాక్సీ ఎం01ఎస్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధర రూ.9,999 ఉండగా.. రూ.9,499 ధ‌ర‌కు లభిస్తోంది.

* గెలాక్సీ ఎం01కు చెందిన 1జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.5,499 ఉండ‌గా.. రూ.4,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. ఇదే ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.6,499 ఉండ‌గా.. రూ.5,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది.

ఇక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల‌తో ఈ ఫోన్ల‌ను కొంటే రూ.1వేయి వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ ఇస్తారు. దీంతో వీటిపై మ‌రో రూ.1వేయి వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news