ఆపిల్ సంస్థ పై శాంసంగ్ ట్రోల్ల్స్.. అసలు విషయమేమిటంటే..!?

-

ఆపిల్ ఐఫోన్ సంస్థ వారు ఇటీవలే మార్కెట్లోకి 12 సిరీస్ ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ధరలు ఎప్పటిలానే ఆకాశాన్ని అంటాయి. కానీ, ఒక్క విషయంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారి తీసేలా చేసింది.. అదేమిటంటే.. ఐఫోన్ 12 సిరీస్ మొబైల్ ఫోన్ కొన్నవారికి ఛార్జర్ మాత్రం లేదు..! అక్షరాలా లక్ష రూపాయలు పెట్టి మొబైల్ ఫోన్ కొని, మళ్లీ ఛార్జర్ కోసం సపరేట్ గా డబ్బులు వెచ్చించాలా..? అంటూ నెటిజన్లు యాపిల్ సంస్థను ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక సోషల్ మీడియా సంగతి చెప్పనవసరం లేదు. యాపిల్ ను అదేపనిగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

ఇక శాంసంగ్.. యాపిల్ సంస్థకు ఉన్న పోటీ సంగతి తెలిసిందే.. శాంసంగ్ తాజాగా తన పోస్టులో యాపిల్ కంపెనీని ఉదేశిస్తూ చేస్తూ ఒక్క పోస్టు పెట్టింది. ‘గెలాక్సీ.. మీరు కోరుకున్నది ఇస్తుంది అని. బెస్ట్ కెమెరా, బ్యాటరీ, పెర్ఫార్మన్స్, 120 హెడ్జెస్ స్క్రీన్ ప్లస్ తో పాటుగా ఛార్జర్ కూడా అంటూ సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ నల్ల రంగు గల ఛార్జర్ ఫోటోను పోస్టు చేసి తాము ఛార్జర్ ఉచితంగా ఇస్తామని తెలిపింది శాంసంగ్.

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఈ పోస్టు చాలా వైరల్ అయింది. ఇప్పటివరకు పదకొండు వేలకు పైగా కామెంట్లు, 80 వేలకు పైగా రియాక్షన్లు వచ్చాయి. ఐఫోన్ 12 సిరీస్‌లో భాగంగా నాలుగు 5జీ ఆధారిత ఫోన్లను విడుదల చేశారు ఆపిల్ సంస్థవారు. ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ 128 జీబీ స్టోరేజీ గల ఫోన్ ధర రూ.1,29,900 కాగా, 256 జీబీ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ. 1,39,900, 512జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ.1,59,900. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి కొన్న ఫోన్లకు చార్జర్ ఇవ్వకపోవటం పై ఆపిల్ సంస్థ పై సర్వత్రా ఆరోపణలు ఎదురవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news