అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన షియోమీ ఎంఐ 10టి ఫోన్లు..!

-

మొబైల్స్ త‌యారీదారు షియోమీ భార‌త్‌లో ఎంఐ 10టి, 10 టిప్రొ పేరిట రెండు నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. వీటిల్లో 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వీటికి 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల పిక్చ‌ర్ క్వాలిటీ బాగుంటుంది. ఈ ఫోన్ల‌లో స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల 5జికి స‌పోర్ట్ ల‌భిస్తుంది.

Xiaomi Mi 10T and Mi 10T Pro smart phones launched in india

ఈ ఫోన్ల‌లో ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ల‌భిస్తుంది. డిస్‌ప్లేల‌కు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్ వ‌స్తుంది. ఎంఐ 10టి ప్రొలో వెనుక భాగంలో 108 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ కలిగిన మెయిన్ కెమెరా ఉంది. ఎంఐ 10టిలో 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను వెనుక‌వైపు ఇచ్చారు. ఇవి సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ల‌ను క‌లిగి ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ల‌భిస్తుంది. వీటికి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ఉంది. కేవ‌లం గంట‌లోనే ఈ ఫోన్ల‌ను ఫుల్ చార్జింగ్ చేసుకోవ‌చ్చు.

షియోమీ ఎంఐ 10టి, ఎంఐ 10టి ప్రొ స్పెసిఫికేష‌న్స్‌…

* 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్
* 2400 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్రాసెస‌ర్
* 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10
* ఎంఐ10టి – 64 మెగాపిక్స‌ల్ బ్యాక్ మెయిన్ కెమెరా
* ఎంఐ10టి ప్రొ – 108 మెగాపిక్స‌ల్ బ్యాక్ మెయిన్ కెమెరా
* 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
* డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

షియోమీ ఎంఐ 10టి, ఎంఐ 10టి ప్రొ ఫోన్లు కాస్మిక్ బ్లాక్‌, లూనార్ సిల్వ‌ర్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల‌య్యాయి. ఎంఐ 10టి ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.35,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.37,999గా ఉంది. అలాగే ఎంఐ10టి ప్రొ 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.39,999గా ఉంది. ఈ ఫోన్ల‌ను ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోం స్టోర్‌ల‌లో విక్ర‌యిస్తున్నారు.

ఎస్‌బీఐ కార్డులు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులు, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా కార్డుల‌తో ఈ ఫోన్‌పై రూ.3వేల వ‌ర‌కు క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు. రూ.2వేల వ‌ర‌కు అద‌న‌పు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ అందిస్తున్నారు. 12 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news