హరీష్ రావును అక్కడ కాలు పెట్టనివ్వను: జగ్గారెడ్డి

-

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతోందని వస్తోన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ.. ఎన్నికలు ఎప్పుడు జరిపినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. సింగూర్ నీటి తరలింపుతో సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్ జిల్లా ప్రజలు నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నీటి తరలించడం వల్ల సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్ ఘనపూర్ ఆయకట్టు రైతులకు, మెదక్ మునిసిపాలిటీకి నీరు అందడం లేదని అన్నారు.

అధికార పార్టీకి చెందిన మెదక్ ఎమ్మెల్యే దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నీటి సమస్యను తీర్చే విషయంలో స్పష్టమైన హామీ వచ్చే వరకు హరీష్ రావును మెదక్, సంగారెడ్డి జిల్లాలో తిరగనివ్వమని అన్నారు. జిల్లా కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల సమస్యను గాలికి వదిలేసి హరీష్ రావు ఇంటి వద్ద భజన చేస్తున్నారని విమర్శించారు. అయితే ప్రజల సమస్యలపై అలక్ష్యం తగదని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news