ఆ గుర్రం వేగం, ఖరీదు తెలిస్తే మతి పోతుంది…!

-

సాధారణంగా గుర్రాలు వేగంగా పరిగెడుతూ ఉంటాయి. అందుకే గతంలో గుర్రాలను ఎక్కువగా వినియోగించే వారు జనం. అయితే ఇప్పుడు మాత్రం వాటి సంఖ్య తగ్గుతూ వస్తుంది. గుర్రపు స్వారీ చేసే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతుంది. ఎక్కడో తప్పా ఇప్పుడు ఎవరూ చేయడం లేదు. దానిని పిల్లలకు నేర్పించడానికి కొందరు తల్లి తండ్రులు ఎక్కువగా కష్టపడటం మనం చూస్తున్నాం.

అది పక్కన పెడితే… గుర్రపు స్వారీ చేసే సమయంలో వేగంగా వెళ్లాలని చాలా మంది చూస్తారు. దానిని ఎక్కువగా వినోదంగా కూడా భావిస్తూ ఉంటారు కొందరు. అయితే తాజాగా ఒక గుర్రానికి సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. మహారాష్ట్రలోని సారంగ్‌ ఖెడాలో ప్రస్తుతం చేతక్ ఉత్సవాలు జరుగుతున్నాయి. చెతక్ ఉత్సవానికి రాజస్థాన్, పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల నుంచి సుమారు 500 గుర్రాలను తీసుకొచ్చి, వాటి మధ్య పోటీ పెడుతూ విజేతలను ప్రకటిస్తున్నారు. ఈ ఉత్సవంలో ఒక గుర్రం విజేతగా నిలిచింది.

పంజాబ్ లోని అమృత్ సర్ కి చెందిన తారా సింగ్ గుర్రం షాన్… అందరిని ఆశ్చర్యానికి చేసింది. ఎక్స్ప్రెస్ ట్రైన్ కి మించి వేగంగా ఇది పరిగెత్తి విజేతగా నిలిచింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఇది పరిగెడుతుంది. దీనితో దీనిని విజేతగా ప్రకటించారు. దీని ఖరీదు పది కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news