టెన్నిస్ స్టార్ సానియా మిర్జాకు సినీ స్టార్లకు మించిన పేరున్న విషయం తెలిసిందే. టెన్నిస్ స్టార్‌గా పాపులర్ అయిన సానియా గ్లామర్ పరంగానూ అంతకు మించిన పేరుని సొంతం చేసుకుంది. చాలా సార్లు సానియాని సినిమాల్లోకి తీసుకురావాలని చాలా మంది ప్రయత్నించారు. బాలీవుడ్ డైరెక్టర్స్ , ప్రొడ్యూసర్స్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ కుదరలేదు.
టాలీవుడ్ స్టార్స్ కూడా సానియాని హీరోయిన్గా పరిచయం చేయాలనుకున్నారు. మంచు విష్ణు లాంటి హీరోలు కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే తాజాగా సానియా ఓ వెబ్ సిరీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలిసింది. ఎమ్ టీవి `నిషేధ్ ఎలోన్ టుగెదర్` పేరుతో ఓ వెబ్ సిరీస్‌ని నిర్మిస్తోంది. ఇందులో సానియా మీర్జా నటించబోతోంది.
ఈ వెబ్ సిరీస్ లో సానియా మీర్జా ఓ ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతోంది. ఐదు ఎపిసోడ్లుగా రానున్న ఈ సిరీస్ ద్వారా ట్యు బర్కులోసిస్పై సానియా అవగాహన కల్పించనున్నారట. భారత్‌లో పెరుగుతున్న టీబీ కేసులపై అవగాహన కల్పించడంలో భాగంగానే సానియా ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని తెలిసింది.