హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి పండుగ ని పెద్ద పండుగ అని కూడా పిలుస్తారు. మూడు రోజుల పాటు సంక్రాంతిని నిర్వహిస్తారు సంక్రాంతి పండుగని సూర్యుడు మకర రాశి లోకి మారడం ని సూచిస్తుంది. సంక్రాంతి పండుగను ఈసారి ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాము. ఈ ఏడాది జనవరి 15న సంక్రాంతి పండుగ వచ్చింది. గతంలో జనవరి 12 ,13 తేదీల్లో కూడా సంక్రాంతి వచ్చింది. ఈసారి లీప్ సంవత్సరం కారణంగా కూడా పండుగ తేదీలో మార్పు వచ్చింది.
సంక్రాంతి పండుగ ఈసారి జనవరి 15న సోమవారం జరుపుకోవాలి ముందు రోజు అనగా ఆదివారం భోగి పండుగ చేసుకోవాలి. సంక్రాంతి పుణ్యకాలం సమయం విషయానికి వస్తే.. ఉదయం 7.15 గంటలకు మొదలవుతుంది. సాయంత్రం 5.46 గంటలకు ముగుస్తుంది. ఉదయం 7.15 గంటలకు మహా పుణ్య కాలం. ఉదయం 9 గంటలకు మహా పుణ్య కాలం ముగుస్తుంది. ఉదయం 6.30 నుంచి 7.30 వరకు శుభ సమయం.