స‌ప్త‌గిరి గూడుపుఠాణి.. ఆ క‌థ ఏంటో మ‌రీ!

-

తెలుగు చిత్ర‌సీమ‌లో చాలా మంది హాస్య‌న‌టులుగా అడుగుపెట్టి.. క‌థానాయ‌కులుగా మారిన విష‌యం తెలిసిందే. అలీ ద‌గ్గ‌ర నుంచి సునీల్ వ‌ర‌కు చాలా మంది హాస్య‌న‌టులు.. క‌థానాయ‌కులుగా న‌టించి.. త‌మ ల‌క్ ను ప‌రీక్షించుకున్నారు. ఇదే కోవ‌కు చెందిన‌వాడు సప్తగిరి కూడా. వెండితెర‌పై హాస్య న‌టుడుగా మెరిసి తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌డుపు నిండా నవ్వించాడు. తెలుగు ప్రేక్ష‌కుల్లోత‌న‌కంటూ ప్ర‌త్యేక‌ గుర్తింపు తెచ్చుకున్నాడు.

saptha giri

మ‌రో వైపు.. అవ‌కాశం.. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా హీరోగా న‌టించి, త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. అలాగే .. మ‌రోసారి సప్తగిరి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు.శ్రీనివాస రెడ్డి – రమేశ్ యాదవ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘గూడుపుఠాణి అనే చిత్రంలో క‌థానాయ‌కుడుగా క‌నిపించ‌నున్నారు. స‌ప్త‌గిరి స‌ర‌స‌న నేహా సోలంకి హీరోయిన్ గా న‌టిస్తుంది. విలన్‌గా మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె న‌టించ‌నున్నారు.

ఈ సినిమాకి కె. ఎమ్. కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ ప్రేమ క‌థ ఆధారంగా ఈచిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. నిన్న రాత్రి ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను రిలీజ్ అయింది. ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఆకట్టుకునేలా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఈ ట్రైలర్ .. సినిమా పై మరింత ఆస‌క్తిని పెంచింది. ఇక ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news