తాజాగా హుజూరాబాద్ లో టీఆర్‌ఎస్, టీడీపీకీ చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటెల రాజెందర్… తెరాసలో తన పరిస్థితికి ఏమాత్రం తీసిపోకుండా హరీశ్ పరిస్థితి ఉండేదని, ఆ దుఃఖం దిగమింగి నేడు హరీశ్ తనపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు! అయితే ఈ సందర్భంగా ఈటెల మాట్లాడిన మాటలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. టీఆర్‌ఎస్ లో హరీశ్ పరిస్థితిపై మరోసారి కామెంట్లు వెలువడుతున్నాయి! ప్రస్తుతం తెరాసలోనూ, హరీశ్ వర్గంలోనూ ఇదే హాట్ టాపిక్!
“నేను గడ్డి పోచను కాదు.. గడ్డపారను. కేసీఆర్ బొమ్మ పెట్టుకుని నేను గెలవలేదు.. హుజూరాబాద్ ప్రజల కాళ్లలో ముళ్లిరిగితే పంటితో పీకాను కాబట్టే ఇన్నాళ్లూ నా ప్రజలు గెలిపిస్తున్నారు” అంటూ మొదలుపెట్టారు ఈటెల. “ఫ్లెక్సీల్లోనూ, గోడలపైనా మీ ఫొటోలుండొచ్చు.. కానీ, నా ఫొటో ప్రజల గుండెల్లో ఉంది. గాలి దుమారానికి, వర్షానికి మీ ఫొటోలు కొట్టుకుపోతాయి. కానీ ప్రజల గుండెల్లో ఉన్న నా ఫొటో చెరిగిపోదు” అని కంటిన్యూ చేశారు ఈటెల!
అనంతరం హరీశ్ పరిస్థితిపై స్పందించిన ఈటెల… “ఒకప్పుడు ప్రజా దర్బారు లాంటి కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రులు ప్రజలను కలుసుకునేవారు.. విచిత్రం ఏమిటటంఏ… ప్రస్తుతం తెలంగాణలో, చివరకు తనలాంటి వాళ్లనూ కూడా ప్రగతిభవన్ గేట్ల దగ్గరే పోలీసులు ఆపేస్తున్నారు”. “మిత్రమా హరీశ్‌రావు.. ఈ బాధలన్నీ నీకు తెలియవా? నీవు అనుభవించలేదా? కావాలంటే నీ ఇల్లాలినడుగు.. తడిచిపోయిన మెత్త(తలదిండు)నడుగు” అని ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు!
దీంతో… తెరాసలో హరీశ్ పరిస్థితి… “గతమెంతో ఘనం – వర్తమానం అయోమయం – భవిష్యత్తు ప్రశ్నార్థకం” అనేస్థాయిలో ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!