సారంగదరియా పాట సరికొత్త రికార్డు..

-

లవ్ స్టోరీ సినిమా నుండి వచ్చిన సారంగదరియా పాట సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఇప్పటి వరకు తెలుగులో ఉన్న రికార్డును బద్దలు కొట్టి తన పేరున లిఖించుకుంది. యూట్యూబ్ లో రిలీజైన ఈ పాట కేవలం 14రోజుల్లోనే 50మిలియన్లని చేరువైంది. అతి తక్కువ రోజుల్లోనే 50మిలియన్లు చేరుకున్న తెలుగు పాటగా రికార్డుకెక్కింది. అంతకుముందు బుట్టబొమ్మ పాట 50రోజుల్లో ఈ రికార్డుని దక్కించుకుంది. ప్రస్తుతం ఆ పాట రికార్డుని తిరగరాసి 14రోజుల్లోనే ఘనత సాధించింది.

నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లవ్ స్టోరీ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకుడు. తెలంగాణ జానపదమైన సారంగ దరియా పాటని సినిమాకి తీసుకువచ్చి, ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని అందించాడు శేఖర్ కమ్ముల. మంగ్లీ తన గాత్రంతో ప్రాణం పోసిందని చెప్పాలి. సుద్దాల అశోక్ తేజ గారి సాహిత్యం చక్కగా కుదిరించి. ఇక ఈ పాటలో సాయి పల్లవి డాన్స్ అదిరిపోనుందని అర్థం అవుతుంది. ఏప్రిల్ 16వ తేదీన లవ్ స్టోరీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news