కేంద్ర విద్యాశాఖా మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంక్ ప్రకారం వెరిఫైడ్ ఆన్ లైన్ టీచర్ ప్యూపిల్ రిజిస్ట్రేషన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్లని డిజిలాకర్ తో అనుసంధానం చేయనుంది. ఈ మేరకు సర్ఠిఫికేట్లు డైరెక్టుగా డిజిలాకర్ యాప్ లో ఉంటాని పేర్కొన్నారు. జారీ చేసిన సర్టిఫికేట్లు డైరెక్టుగా డిజిలాకర్ తో అనుసంధానం అవుతాయని, కావాలనుకుంటే అక్కడే చూసుకోవచ్చని, ఇంకా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సైట్ అయిన https://digilocker.gov.in/ ఇక్కడ కూడా లభిస్తాయని పేర్కొన్నారు.
దీనికి రిజిస్ట్రేషన్ ఫీజుని మాఫీ చేస్తున్నామంటూ చెప్పారు. ఈ రిజిస్ట్రేషన్ ఫీజు 200గా ఉంది. ఈ డిజిలాకర్ ని ఆండ్రాయిడ్, ఆపిల్ ఐఫోన్ల ప్లే స్టోర్ల నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులు ఎక్కువగా నడుస్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 9, 10వ తరగతులకి తప్ప మిగతా వారందరికీ దాదాపుగా ఆన్ లైన్లోనే క్లాసులు జరుగుతున్నాయి.